సైబర్ నేరాల నియంత్రణకు సహకరించాలి
● బ్యాంకు అధికారులకు
ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి సూచన
పార్వతీపురంటౌన్: సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి కోరారు. ఎస్పీ కార్యాల యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు మేనేజర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలపై దర్యాప్తుచేసే పోలీస్ అధికారులకు అవసరమైన సమాచారం ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. బ్యాంకుల వద్ద భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై సమీక్షించారు. సైబర్ నేరాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన బాధితులు 2023లో రూ.1,15,27,069లు, 2024 లో రూ.21,85,79,595లు పోగొట్టుకున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలు తగ్గుముఖం పట్టేలా, నగదు పోగొట్టుకున్న బాధితులకు న్యాయంచేసే దిశగా బ్యాంకు అధికారులు, పోలీస్ వారు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిరక్షరా స్యులు, గిరిజన ప్రాంతవాసులను సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. పూర్తి ఆధారాలు సేకరించాకే బ్యాంకు ఖాతా తెరవాలన్నారు. ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే అనుమానస్పద బ్యాంకు అకౌంట్లపై నిఘా పెట్టాలని కోరారు.
ఫేక్‌లోన్ యాప్‌లపై అన్రమత్తత అవసరం
ఫేక్‌లోన్ యాప్‌లు, సామాజిక మాధ్యమాల్లో లింక్‌లను పంపి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని నమ్మించడం, ఫెడెక్స్, బ్లూ డాట్ కొరియర్స్, లోన్ యాప్, ఓటీపీ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఒ.దిలీప్ కిరణ్, ఏఎస్పీ అంకిత సురాన, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఎస్బీ సీఐ పైడి రంగనాథం, డీసీఆర్‌బీ సీఐ ఎర్రంనాయుడు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment