సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జీఎంఆర్ విద్యార్
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన ఎంపికలో సబ్ జూనియర్, జూనియర్ విభాగంలో విద్యార్థులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగానికి సంబంధించి 105 కేజీల విభాగంలో పి.మహేంద్రరావు, 120 కేజీల విభాగంలో ఎస్.సాయిసుధీర్, 52 కేజీల విభాగంలో వి.నిహారిక, 72 కేజీల విభాగంలో పి.దీపిక, 63 కేజీల కేటగిరీలో ఎన్.రుచితలు ఎంపికయ్యారని అన్నారు. అలాగే జూనియర్ విభాగానికి సంబంధించి 59 కేజీల కేటగిరీలో వి.శరత్ ఎంపికయ్యారని తెలిపారు. వీరంతా ఈ నెల 24 నుంచి 27 వరకు తమిళనాడు రాష్ట్రం సలేం డివిజన్ డీఆర్ఎం ఆఫీస్ రైల్వే క్వార్టర్స్‌లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థుల ఎంపిక పట్ల ప్రిన్సిపాల్‌తో పాటు ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూండెట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, పీడీ బి.అరుణ్‌కుమార్, విద్యార్థులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment