ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫిట్స్.. తప్పిన ప్రమాదం
వీరఘట్టం: మండలంలోని కొట్టుగుమ్మడ నుంచి రేగులపాడు గ్రామానికి శుక్రవారం మొక్కజొన్న తొక్కును ట్రాక్టర్‌తో తీసుకువెళ్తున్న డ్రైవర్ మున్నాకు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. సరిగ్గా వీరఘట్టం పట్టణంలోని తెలగవీధి మలుపు నుంచి ప్రధాన రహదారిపైకి ట్రాక్టర్‌ను ఎక్కిస్తుండగా ఫిట్స్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందు భాగం పైకి లేవడంతో ట్రాక్టర్ తొట్టెలో మొక్కజొన్న తొక్కుపై ఉన్న నలుగురు మహిళలు భయంతో కేకలు వేశారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడబోతుండగా సమీపంలో ఉన్న కొందరు ఆటో డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు వెంటనే ట్రాక్టర్‌పైకి ఎక్కి ఇంజన్‌ను అదుపు చేశారు. ట్రాక్టర్‌ను రోడ్డుపైకి తీసుకువచ్చారు. సీటులో ఫిట్స్ వచ్చి కాలు, చేతులు కొట్టుకుంటున్న డ్రైవర్ మున్నాను కిందకు దించి సపర్యలు చేసారు. దీంతో కొద్ది సేపటికి డ్రైవర్ సాధారణ స్థితికి వచ్చి ఆరోగ్యం కుదుటపడింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేనిదే మందులు వాడొద్దు..
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాణి
విజయనగరం ఫోర్ట్: డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేనిదే ఎటువంటి మందులు వేసుకోరాదని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.రాణి సూచించారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ అవగాహన ర్యాలీని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ సూచన మేరకు అవసరమైనన్ని రోజులు మందులు వాడాలన్నారు. మందులు ఎక్కువ వాడితే అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని తెలిపారు. కార్యక్రమంలో డీఎంఓ మణి, న్యూక్లియర్ మెడికల్ ఆఫీసర్ అర్చనదేవి, ఎపిడిమాలజిస్టు వెంకటేష్ , డెమో చిన్నతల్లి పాల్గొన్నారు.
యాంటీ బయాటిక్ మందులు అతిగా వాడరాదు
యాంటీ బయాటిక్ మందులు అతిగా వాడరాదని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంబంగి అప్పలనాయుడు అన్నారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద శుక్రవారం ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ వారోత్సవాలు సందర్బంగా నిర్వహించిన ర్యాలీని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పీఏ రమణి, మైక్రో బయాలజి హెచ్‌ఓడీ డాక్టర్ బి.అరుణశ్రీ, అసోసియేట్ ప్రొఫెసర్ పార్వతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ లావణ్య తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment