మంత్రి సవిత రాజీనామా చేయాలి
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ132 శ్రీ234 శ్రీ244
వీరఘట్టం: ఏపీ శాసనమండలిలో రాష్ట్ర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి సవిత తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి డిమాండ్ చేసారు. శుక్రవారం ఆమె వండువలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై కళావతి మండిపడ్డారు. వెంటనే మంత్రి సవిత రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ఒక మహిళా మంత్రిగా ఉండి రాష్ట్ర మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడటం సమంజసం కాదన్నారు. మంత్రి సవిత శాసన మండలిలో రాష్ట్ర మహిళల పట్ల చాలా దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇటువంటి వారికి చట్టసభలకు వెళ్లే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు... ఈ హామీ ఎప్పుడు నెరవేరుస్తారని కళావతి ప్రశ్నించారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన కూటమి నాయకులు అధికారం వచ్చిన తర్వాత ఈ హామీకి తూట్లు పొడుస్తూ ఈ ఏడాది ఒక్క గ్యాస్ సిలెండర్ ఇచ్చి రెండు సిలెండర్లను బొక్కేసారని ఆవేదన వ్యక్తం చేసారు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిసారీ గత ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుని ఇటువంటి సభలను పక్కదోవ పట్టిస్తున్నారని కళావతి ఆవేదన వ్యక్తం చేసారు.
మాజీ ఎమ్మెల్యే కళావతి
Comments
Please login to add a commentAdd a comment