బిల్లుల షాక్..!
విద్యుత్ వినియోగదారులకు
● ఎన్నికల ముందు చార్జీలను పెంచబోమంటూ వాగ్దానం ● అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ట్రూ అప్ చార్జీల పేరిట వడ్డన ● యూనిట్ విద్యుత్‌పై గరిష్టంగా రూ.2.50 అదనం ● జిల్లాలో 4.5 లక్షల మంది వినియోగదారులపై బాదుడు
నిరసన తెలిపి వినతి అందజేసి..
ఇంధన సర్దుబాటు చార్జీల పెంపు అంశంపై జిల్లా వ్యాప్తంగా ఆటు వినియోగదారులు, ఇటు ప్రజాపక్షాన ఉన్న ప్రతిపక్షాలు సైతం ఆందోళ నకు సిద్ధమయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలు జిల్లా వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా నిరసనలు తెలియజేస్తుంటే సీపీఐ, సీపీఎం, వామపక్షాల నేతలు జిల్లా కేంద్రంలో నిరసనలు తెలిపి పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వినతులు అందజేశారు. వారం రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.
పార్వతీపురంటౌన్/పార్వతీపురం:
సూపర్‌సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తూ ప్రజలనడ్డి విరుస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచబోమని, ట్రూ అప్ చార్జీలు కూడా ఎత్తేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి..తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఇప్పుడు నంగనాచిలా బుకాయిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచింది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట గత నెలలో వినియోగదారులపై భారాన్ని మోపిన ప్రభుత్వం ఇప్పుడు ఈ నెల నుంచే మరో బాదుడుకు సిద్ధమైంది. 2026 వరకు ఈ బాదుడును వినియోగదారులు భరించాలా తీర్మానించి కొత్త చార్జీలను అమలు చేసింది. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నుంచి ఆమోదం లభించడంతో ప్రజలపై కొత్త భారం పడనుంది.
స్మార్ట్ బాదుడుకు సిద్ధం
జిల్లా వ్యాప్తంగా 4.12లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ సర్వీసులన్నీ త్వరలో స్మార్ట్ మీటర్ల కిందకు రాబోతున్నాయి. స్మార్ట్ మీటర్లను అందించే వెసులు బాటును ఆదాని గ్రూప్ సంస్థకు ప్రభుత్వం ఇచ్చినట్లు తెలిసింది. విడతల వారీగా జిల్లాలో స్మార్ట్ మీటర్లను అమలు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు సిద్ధమయారు. మొదటి విడతగా ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తయ్యాక రెండో విడతగా వ్యాపార సముదాయాలకు, పరిశ్రమలకు, వ్యవసాయ బోర్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ తరువాత మూడో విడతగా గృహాలకు స్మార్ట్ మీటర్లను పెట్టనున్నారు. స్మార్ట్ మీటర్లను వినియోగించుకుంటే నిత్యం వాడే సెల్‌ఫోన్ లాగే స్మార్ట్ మీటర్లకు ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీచార్జ్ చేసుకోవడం మరిచిపోతే కరెంట్ దానికదే కట్ అయిపోతుంది. మళ్లీ రీచార్జ్ చేయాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ తతంగాన్ని గ్రామీణ ప్రాంతాల వారు చేసుకోలేరనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
ఐదు నెలల్లో రెండు సార్లు చార్జీల మోత
ఇంధన సర్దుబాటు చార్జీల పేరిట ఇటీవలే డిస్కంల ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించడంతో దాదాపుగా ఎల్‌టీ వినియోగదారుని విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు గరిష్టంగా రూ.2.50 వరకు పెరిగింది. రెండు నెలల క్రితం యూనిట్ వినియోగ చార్జీలు రూ.1.55 వరకు పెంచేసిన సర్కార్ ఇప్పుడు రెండోసారి మరో రూ.0.92 వరకు పెంచేస్తూ నిర్ణయించింది. దీంతో వరుసగా రెండు సార్లు చార్టీల పెంపు అమలు చేయడంతో విద్యుత్ వినియోగ దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొదటి పెంపుతో నవంబర్ నుంచి 2026 జనవరి వరకు, అలాగే రెండో దఫా పెంపుతో ఈనెల నుంచి 2028 నవంబర్ వరకు ఆదనపు బార్జీల భారం పడనుంది.
ప్రజలపై విద్యుత్ కొనుగోలు భారం
విద్యుత్ కొనుగోలు భారాలను ప్రజలపై రుద్దాలని నిర్ణయించుకుని గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే రెండు సార్లు చార్జీల పెంపుతో బాదేసింది. నిజానికి ప్రభుత్వాలే ఈ భారాన్ని భరిస్తే విద్యుత్ చార్జీల పెంపు అనేది జరిగే అవకాశం ఉండేది కాదు. అయితే ఈ సర్దుబాటు భారాన్ని తాము మోయలేమంటూ కూటమి సర్కార్ చేతులెత్తేయడంతో విద్యుత్ చార్జీల పెంపు షాక్ రాష్ట్ర ప్రజలకు తప్పడం లేదు. దీంతో విద్యుత్ విని యోగదారుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment