విద్యార్థుల్లో రక్తహీనత ఉంటే వార్డెన్లదే బాధ్యత
పార్వతీపురం: జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, సంక్షేమ వసతిగృహాల్లో చదివే విద్యార్థుల్లో రక్తహీనత ఉంటే వార్డెన్లదే బాధ్యత అని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వసతి గృహాల ప్రత్యేకాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఇంతవరకు నిర్వహించిన మూడు పల్లెనిద్రలు, గ్రామ దర్శిని కార్యక్రమాల్లో గుర్తించిన 156 సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని చెప్పారు. వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని, అలాగే విద్యాప్రమాణాలు మెరుగుపరచాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎస్.కృష్ణ, జిల్లా మత్స్యశాఖ అధికారి తిరుపతయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, డీవీఈఓ మంజులావీణ, డీపీఓ కొండలరావు, డ్వామాపీడీ రామచంద్రరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి సబ్ కలెక్టర్లు, మండల అధికారులతో ధాన్యం కొనుగోళ్లు, పీజీఆర్‌ఎస్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభికతో కలిసి సమీక్షించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు, పశుసంవర్ధకశాఖాధికారి మన్మథరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment