వికసించిన గ్రామీణ క్రీడా కుసుమం
● భారత జూనియర్ వాలీబాల్ జట్టుకు విజయలక్ష్మి ఎంపిక
● థాయిలాండ్‌లో శిక్షణ శిబిరానికి అర్హత
విజయనగరం: భారత జూనియర్ వాలీబాల్ జట్టుకు విజయనగరం జిల్లాకు చెందిన గ్రామీణ క్రీడాకారిణి అర్హత సాధించింది. జిల్లాలోని గుర్ల మండలం జమ్ము గ్రామానికి చెందిన ఎం.విజయలక్ష్మి ఈ ఘనత సాధించి గ్రామీణ క్రీడాకారుల సత్తా చాటింది. విశాఖలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ హాస్టల్‌లో శిక్షణ పొందిన ఆమె ఇటీవల గుజరాత్‌లో నిర్వహించిన భారత జూనియర్ వాలీబాల్ జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై న 16 మందిలో స్థానం దక్కించుకుంది. భారత జట్టుకు ఎంపికై న క్రీడాకారిణి విజయలక్ష్మి జనవరి నెలలో థాయిలాండ్‌లో నిర్వహించే శిక్షణ శిబిరానికి హాజరుకానుంది. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు దక్కించుకున్న విజయలక్ష్మి భారత జట్టుకు అర్హత సాధించడం పట్ల సర్వత్రా హక్షం వ్యక్తమవుతోంది. గ్రామీణస్థాయి నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకున్న విజయలక్ష్మిని రాష్ట్రవాలీబాల్ సంఘం అధ్యక్షుడు పీజీవీఆర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి టీవీ భగవాన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు సూరిబాబు, కార్యదర్శి కేవీఏఎన్ రాజు, స్కూల్‌గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణంరాజు, కోచ్ సత్యనారాయణలు అభినందించారు. విజయలక్ష్మి భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి విజయనగరం కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment