ఆమె ప్రతిభ ‘ప్రత్యేకం’
రేగిడి: మండలంలోని నాయిరాలవలస గ్రామానికి చెందిన కొవ్వాడ స్వప్నకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం హైదరాబాద్‌లో కల్చరల్ అవార్డును అందజేశారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డును స్వప్పకు అందించినట్లు ఆమె బంధువులు తెలిపారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక ధపా ఈ అవార్డు అందిస్తారని, ఈ ఏడాది తనకు కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని స్వప్న వెల్లడించింది. తనకు రెండు చేతులు లేకపోయినా నోటి ద్వారా చిత్ర కళా రంగంలో రాణించినట్లు వివరించింది.
స్వప్నకు కల్చరల్ అవార్డు అందజేసిన తెలంగాణ గవర్నర్
ఆనందం వ్యక్తం చేస్తున్న అవార్డు గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment