ఆర్థిక స్వావలంబనతోనే మహిళా సాధికారత
విజయనగరం: ఆర్థిక స్వావలంబనతోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని, ఆ దిశగా రాణించేందుకు టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చింతలవలస 5వ బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్ అన్నారు. ఈ మేరకు స్థానిక థెరిసా క్లబ్‌లో టైలరింగ్ లో మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మంగళవారం సర్టిఫికెట్లను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ గార్గ్ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా థెరిసా క్లబ్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి, విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ, పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యాన్నదానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సేవామూర్తి మదర్ థెరిసా స్ఫూ ర్తితో భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం క్లబ్ ప్రతి నిధులు ముఖ్య అతిథి కమాండెంట్ మల్లికాగార్గ్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకురాలు కురియాకోస్, సభ్యులు గ్రంధి విష్ణుమూర్తి, రెడ్డి ఆదినారాయణ, డి.సుకుమార్, పి.జనార్దన రావు, పప్పు విశ్వనాథం, డి.నవ్య, పి. తేజస్విని, బి.మంజుల తదితరులు పాల్గొన్నారు.
5వ బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్
Comments
Please login to add a commentAdd a comment