●మాకు ఉరే సరి..!
మేమంతా ఏ భగవంతుడికి నివేదించుకోవాలి. మా మొర ఏ నాయకుడు పట్టించుకుంటారు.
మా ఆవేదన ఏ ఉన్నతాధికారి ఆలకిస్తాడు. న్యాయమైన మా డిమాండ్లు పరిష్కారానికి
నోచుకునేదెన్నడు? అంటూ 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గిరిజన గురుకులాల్లో
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు సోమవారం వినూత్న రీతిలో
నిరసన తెలియజేశారు. ఈ మేరకు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే ఉరి వేసుకుంటా మంటూ మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపారు. సమానపనికి సమాన వేతనం చెల్లించాలని, 2022 పీఆర్‌సీ ప్రకారం జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్స్‌గా తమను మార్చాలని కోరారు. అంతకు ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు వాబయోగి ఉద్యమ కరపత్రాన్ని ఆవిష్కరించి నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో గిరిజన జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు, బి.ఉమామహేశ్వరరావు, అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు బి.గణేష్, బి.ధర్మారావు,
ఎస్.మోహన్‌రావు, రవికుమార్, కె.భవాని, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. –సీతంపేట
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment