నాగావళి మురిసినది
గరుగుబిల్లి:
‘పోలిపాడ్యమి’ సందర్భంగా తోటపల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం భక్తుల ‘ఓం నమః శివాయ..హరహర మహదేవ శంభో శంకర’ ‘ఏడు కొండలవాడ వేంకటరమణ...గోవిందా...గోవిందా’ అంటూ చేసిన దైవ నామస్మరణతో హోరెత్తింది. ఆలయ అర్చకుడు అప్పలాచార్యులు నాగావళినదికి పుణ్య హారతులిచ్చి పోలిపాడ్యమి పూజలను ప్రారంభించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి భక్తులు సమీపంలోని నాగావళినది తీరానికి చేరుకున్నారు. కార్తీకమాసంలో నెలరోజులనుంచి చేసిన పూజలకు నదీతీరంలో వీడ్కోలు చెబుతూ మార్గశిర శుద్ధ పాడ్యమినాడు మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ తెప్పలపై దీపాలనుపెట్టి నదిలో విడిచిపెట్టారు. అనంత రం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. పార్వతీపురం, గరుగుబిల్లి, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస తదిత ర మండలాలతోపాటు రాజాం, వీరఘట్టం తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ మార్గశిరశుద్ధ పాడ్యమినా డు జీవనదుల్లో స్నానంచేసి స్వామివారిని దర్శించుకుంటే, కోటి నదులలో స్నానం ఆచరిస్తే ఎంత ఫలి తం వస్తుందో, పాడ్యమిరోజు నదులలో స్నానం చేయడంవల్ల అంత గొప్ప ఫలితం వస్తుందని పురాణాలలో పేర్కొన్నట్లు తెలిపారు. పూజలలో పాల్గొన్న భక్తులకు ఉచిత ప్రసాదాలను ఆలయ సిబ్బంది వితరణ చేశారు. స్థానిక ఎస్సై రమేష్‌నాయుడు పర్యవేక్షణలో భక్తులను క్యూలో ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అలాగే ఆలయ సిబ్బంది, టీటీడీ అభివృద్ధి కమిటీ సభ్యులు అవసరమైన సేవలను అందించారు.
దీపాలతో ప్రత్యేక పూజలు
పోలిపాడ్యమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు వెలిగించిన దీపాలు ప్రత్యేక అలంకరణగా నిలిచాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి పూజలు ప్రారంభించడంతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా కాంతులతో నిండింది. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు, రామ భజనలు భక్తులను ఆకర్షించాయి. ఆలయంనుంచి నాగావళి నదీ తీరం వరకు ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు చాలా ఆకర్షణగా నిలిచాయి.
తోటపల్లి కిటకిట
భక్తుల రాకతో పులకించిన నాగావళి
నదిలో తెప్పలు విడిచిపెట్టిన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment