డీఆర్‌ఓ బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం: జిల్లా రెవెన్యూ అధికారిగా కె. హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభికలను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. డీఆర్‌ఓగా హేమలత నియామకం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. హేమలత గతంలో పార్వతీపురం, పాలకొండ, విజయనగరం ఆర్డీఓగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్వతీపురం రిట ర్నింగ్ అధికారిగా పనిచేసి పలువురి ప్రశంసలు పొందారు.
8న మాలల మహాగర్జన
పాలకొండ రూరల్: ఎస్సీ వర్గీకరణ అనాలోచిత నిర్ణయమని, దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాలకొండ పట్టణంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో సంఘ నాయకులు ఎద్దు లిల్లీ పుష్పనాథం, నూతపాటి భరత్‌భూషణరాజు మాట్లాడుతూ వర్గీకరణతో ఐక్యతను దెబ్బతీయొద్దన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 8వ తేదీన విశా ఖలో తలపెట్టిన ఉత్తరాంధ్రా మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని కోరారు. దీని కి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
గంజాయి వ్యాపారుల ఆస్తులను జప్తుచేస్తాం
● విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి వ్యాపారుల ఆస్తులను గుర్తించి జప్తు చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో సోమవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయివ్యాపారుల ఆస్తుల గుర్తింపులో సాధించిన పురోగతిపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆదేశాలతో గంజాయి నిందితుల ఆస్తులను గుర్తించడంపై దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment