సబ్‌జైల్‌ను పరిశీలిస్తున్న విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి
పార్వతీపురం టౌన్: పట్టణంలోని సబ్‌జైల్‌ను విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ జైల్ పరిసరాలు, శానిటేషన్‌ను పరిశీలించారు. రికార్డులను, ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి సబ్ జైల్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. వారికి అందించే ఆహారం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని ఖైదీలను కోరారు.
న్యాయవాదిని నియమించుకోలేని వారికి న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఖైదీలలో సత్ప్రవర్తనతోనే మార్పు సాధ్యమవుతుందని జడ్జి అన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదరరావు, లోక్ అదాలత్ సభ్యుడు టి.జోగారావు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వెంకటరావు, సబ్‌జైల్ సూపరింటెండెంట్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment