జంఝావతి కన్నీటియాత్ర
● జంఝావతిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్
పార్వతీపురం టౌన్: జంఝావతి ప్రాజెక్టుపై పాలకులు శీతకన్నువేశారు.. ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు.. తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తినాయుడు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై పాలకుల తీరుకు నిరసనగా పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామ సమీపంలో సోమవారం ‘జంఝావతి కన్నీటియాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా వివాదం నెపంతో ప్రాజెక్టు పనులను నిలిపివేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వమే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నందున జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి స్పందించి జంఝావతి రైతుల కన్నీటిని తుడవాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం తలచుకుంటే ఒడిశా వివాదం పరిష్కారమవుతుందన్నారు. జంఝావతిని సాధించేందుకు ఓ సాధన కమిటీని నియమించాలని కోరారు. కార్యక్రమంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు జాగారపు ఈశ్వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి రఘు సత్య సింహచక్రవర్తి, బీజేపీ నాయకుడు మరిశర్ల రామారావు, ప్రత్యేక సలహాదారు శివకృష్ణ, విజయనగరం, విశాఖప ట్నం సమితి జిల్లా అధ్యక్షుడు ఐ.గోపాలరావు, దేవుపల్లి సత్యారావు పట్నాయక్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు భారతానంద స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment