మొక్కజొన్న సస్యరక్షణ ఇలా..
విజయనగరం ఫోర్ట్: ఇటీవల కురిసిన వర్షాల వల్ల మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.శ్రీనివాస్ తెలిపారు. పంట సంరక్షణ చర్యలను సోమవారం వెల్లడించారు. ముందుగా పొలంలో నీరు లేకుండా చేయాలి. అనంతరం 19:19:19 (నీటిలో కరిగేది), ప్రొపికొనజోల్ 200 ఎం.ఎల్, ఇమమెట్టిన్ బెంజియేట్ 80 గ్రాములు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుము పంటల సాంద్రత బాగుంటే ఎకరాకు 10 కేజీల యూరియా వేయాలి. ఆ తర్వాత మల్టీకే, ప్రొపికొనజోల్ 400 ఎం.ఎల్, శాప్ 500 ఎం.ఎల్‌ను పదిట్యాంకుల నీటిలో కలిపి పిచికారీ చేయాలని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment