పనులు పూర్తి చేయకుంటే చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో షెడ్యూల్ ప్రకారం అభివృద్ధి పనులు పూర్తిచేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాల్వలు, పశువుల శాలలు, ఇతర అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో సోమవారం సమీక్షించారు. నత్తనడకన సాగుతున్న నిర్మాణాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. పనులు మొదలై నెలరోజులు కావస్తున్నా నేటికీ 50 శాతం పురోగతి లేదని, ఇదే తరహాలో చేస్తే సంక్రాంతి నాటికి పూర్తిచేయడం అసాధ్యమన్నారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపౌండ్ కింద జిల్లాకు కేటాయించిన నిధులను వినియోగించలేకపోతే వచ్చే ఏడాది మంజూరుకావన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డ్వామా ఏఓ వెంకటరమణ, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి నిర్మలాదేవి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment