చిక్కెనో చేపపిల్ల!
–8లో
ఎవరి వలకు
మంగళవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
సాక్షి, పార్వతీపురం మన్యం: వల వేయకుండానే చేప పిల్లలను పట్టేసేందుకు కొంతమంది ప్రయత్నాలు సాగిస్తున్నారు. మత్స్యశాఖలోని పెద్దల అండదండలతో మొత్తం గుటుక్కున మింగేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయినవారికి అప్పనంగా చేప పిల్లల సరఫరా కాంట్రాక్టును అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోందని వినికిడి. టెండర్ల విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం చెప్పడం వీరికి వరంగా మారింది. జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ(డీపీసీ) ద్వారా కాంట్రాక్టును కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ లెక్క...
జిల్లాలోని జలాశయాల్లో ఈ ఏడాది 44.22 లక్షల చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మత్స్య సంపదను పెంచాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయి. వాస్తవానికి ఆన్‌లైన్ విధానంలో టెండర్లు పిలిచి చేప పిల్లల సరఫరా బాధ్యతను అప్పగించాల్సి ఉంది. వానాకాలానికి ముందే ఇది జరిగిపోవాలి. అప్పుడే చేప పిల్లలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడే మత్స్యశాఖ అధికారులు కొంతమంది చక్రం తిప్పి, ఈ ప్రక్రియను జాప్యం చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు జిల్లా ప్రొక్యూర్‌మెంట్ కమిటీ ద్వారా కొటేషన్లు పిలవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. టెండర్లు లేకుండానే జిల్లాలో ఏకమొత్తంగా ఒకే కాంట్రాక్టరుకు అప్పగించేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరిగిపోయినట్లు సమాచారం.
న్యూస్‌రీల్
పిల్లకు రూ.1.27 పైసలు!
ఇప్పటికే సీతంపేట పరిధికి సంబంధించి శ్రీకాకుళం జిల్లా ప్రాతిపదికన టెండర్ ఖరారు చేసినట్లు సమాచారం. అక్కడ గుత్తేదారు రూ.21 లక్షలకు టెండరు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక చేపపిల్లకు రూ.1.27 పైసలు చొప్పున కట్టబెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కూడా ఎల్–1కే (అదే కాంట్రాక్టరుకు) ఇచ్చేందుకు నెల రోజుల కిందటే అనధికారికంగా అంగీకారానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీని కంటే 20 పైసలు వరకు తగ్గించి చేస్తామని కొంతమంది కాంట్రాక్టర్లు ముందుకొచ్చినప్పటికీ అధికారుల నుంచి సహకారం కొరవడినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ పథకం నిధుల దోపిడీకి స్కెచ్
టెండర్ లేకుండా చేప పిల్లల సరఫరాకు యత్నం!
అయిన వారికి కట్టబెట్టేందుకు సన్నాహాలు
వరంగా ప్రభుత్వ నిబంధనలు
అనువుగాని కాలంలో...
జిల్లాలో చేపల సంపద అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. మత్స్య సంపద ద్వారా ఏడాదికి దాదాపు రూ.194 కోట్లు ఆదాయం చేకూరుతోంది. జిల్లాలో ఉన్న అన్ని పంచాయతీల్లో సుమారు 1,800 చెరువులు ఉన్నాయి. చేపల పెంపకంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 96 వేల మంది ఆధారపడి ఉన్నారు. వాస్తవానికి జలాశయాల్లో వేసేందుకు ఏటా ఆగస్టు నుంచి నవంబర్ నెలలోగా మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారం వచ్చేసినా ఇంకా ఆ ప్రక్రియ చేపట్టలేదు. ప్రస్తుతం చెరువుల్లో నీరు తక్కువగా ఉంది. ఈ కాలం అంత అనువైనది కాదని మత్స్యకారులు అంటున్నారు. చిన్న పిల్లలు వేయగానే.. పెద్ద చేపలు కొట్టేస్తాయని చెబుతున్నారు. ఫలితంగా ఇప్పుడు వేసిన పిల్లలు బతకడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏటా జలాశయాల్లో చేప పిల్లల ఉత్పత్తికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్న విషయం విదితమే. చెరువులో ఎన్ని వదిలారు, ఎన్ని బతికాయి? అన్న విషయాలపై లెక్కలు ఉండవు. ఇదే అదునుగా లేని లెక్కలు చూపి, అధికారులు దోచుకుంటున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇప్పుడు సరఫరా కాంట్రాక్టులోనూ తమకు నచ్చిన వారికే కట్టబెట్టి మరింత దోపిడీకి తెర తీస్తున్నారన్న ఆరోపణలు ఇదే రంగంలో ఉన్న పలువురు కాంట్రాక్టర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment