31న యువజన ఉత్సవ్
పార్వతీపురంటౌన్: జిల్లా యువజన ఉత్సవ్ 2024ను ఈ నెల 31న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్టు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకటఉజ్వల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవ్‌లో పాల్గొనే విద్యార్థులు ఆ రోజు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జానపద నృత్యాలు, జానపద గీతాలు, రకరకాల పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో విజేతలను రాష్ట్ర స్థాయిలో జరిగే యువజనోత్సవాలకు పంపిస్తామన్నారు. సైన్స్‌మేళా, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రూప్ ఈవెంట్ పోటీల్లో వరుస ముగ్గురు విజేతలకు రూ.7 వేలు, ద్వితీయ స్థానికి రూ.5 వేలు, తృతీయ స్థానానికి రూ.3 వేలు, వక్తృత్వ పోటీల్లో విజేతలకు రూ.5 వేలు, రూ.1,500, రూ.వెయ్యి, యంగ్ రైటర్స్, యంగ్ ఆర్టిస్టు, ఫొటోగ్రఫీ కంటెస్ట్ పోటీల్లో విజేతలకు వరుసగా రూ.2,500, రూ.2000, రూ.1500 చొప్పున నగదు బహుమతి అందజేస్తామన్నారు. యువఉత్సవ్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులందరికీ సర్టిఫికెట్స్ అందిస్తామని ఆ ప్రకటనలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment