–10లో
శుక్రవారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ గృహ వినియోగదారునికి గత ఏప్రిల్, మే నెలల్లో రూ.380 నుంచి రూ.400 వరకు విద్యుత్ బిల్లు వచ్చింది. నవంబర్ నెల వినియోగానికి ఇటీవల ఇచ్చిన బిల్లులో రూ.360 వచ్చింది. వాస్తవానికి అప్పట్లో వచ్చిన బిల్లు మొత్తంతో పోల్చుకుంటే.. రూ.10 తక్కువే కనిపించొచ్చు. వినియోగంలోనే తేడా. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉంటేనే గానీ.. ఉండలేని పరిస్థితి. దీంతో సాధారణంగానే వాడిన యూనిట్లు ఎక్కువవుతాయి. ‘ప్రస్తుతం చలికాలం. దీనికితోడు వర్షాలు పడుతున్నాయి. ఏసీలు, కూలర్లను ఎప్పుడో పక్కన పెట్టేశాం. ఫ్యాన్లు తిరగడం కూడా కష్టమే. ఇటువంటి రోజుల్లో సాధారణంగా బిల్లు రూ.150 నుంచి రూ.170 వరకు ఏటా వచ్చేద’ని సదరు వినియోగదారుడు చెబుతున్నాడు. అందుకు భిన్నంగా చలికాలంలో రెట్టింపు రావడంతో కంగుతిన్నాడు.
చిత్రంలో విద్యుత్ బిల్లు చూపిస్తున్న మహిళది కురుపాం మండలం గుజ్జలగండ గిరిజన గ్రామం. ఎస్సీ, ఎస్టీ సబ్సిడీ కింద గతంలో ఆమె విద్యుత్ బిల్లు చెల్లించిన దాఖలా లేవు. ప్రస్తుత నెల బిల్లులో 310 యూనిట్లు వినియోగించినట్లు వచ్చింది.అందుకుగాను సబ్సిడీ పోను బిల్లు రూ.25 అని స్వయంగా అందులోనే ఉంది. మొత్తం బిల్లుకు వచ్చేసరికి రూ.3,119 చెల్లించాలని రావడంతో ఆమె లబోదిబోమంటోంది. తాము వినియోగించే ఒక లైటుకు అంత బిల్లు ఏంటంటూ వాపోతోంది. మరో మార్గం లేక, ఆ బిల్లు మొత్తం చెల్లించినట్లు చెబుతోంది.
చిత్రంలో విద్యుత్ బిల్లు చూపిస్తున్న గిరిజనుడిది కూడా గుజ్జలగంగ గిరిజన గ్రామమే. ఆయన ఇంటిలో ఉన్నది ఒక ఫ్యాను, ఒక లైటు మాత్రమే. గత ఐదేళ్లలో ఏనాడూ ఆయన విద్యుత్ బిల్లు చెల్లించే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద విద్యుత్ సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆయనకు నవంబర్ నెల విద్యుత్ బిల్లు రూ.2,268 వచ్చింది. మరోదారిలేక అప్పుచేసి విద్యుత్ బిల్లును చెల్లించానని తెలిపారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment