రామతీర్థంలో సహస్ర దీపారాధన
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. తూర్పు రాజగోపురం సమీపంలోని వేదికపై ఉన్న ప్రత్యేక ఊయలలో సీతారామచంద్ర స్వామిని ఆశీనులు చేసి సహస్ర దీపాల కాంతుల శోభలో స్వామికి పవళింపు జరిపించారు. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు భక్తి శ్రద్ధలతో సహస్ర దీపాలను వెలిగించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, రామ గోపాలా చార్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment