ఘనంగా పెదపోలమాంబ పెద్ద పండగ
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, శంబర పోలమాంబ మేనత్త పెదపోలమాంబ అమ్మవారి పెద్దపండగ మంగళవారం అంగరంగా వైభవంగా సాగింది. చదురుగుడిలో అమ్మవారి ఘటాలకు పూజారి కుటుంబీకులు బంగారపు పూత అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చదురుగుడి నుంచి సాయంత్రం నాలుగు గంటల సమయంలో బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు నడుమ అమ్మవారి ఘటాలను గ్రామంలో తిరువీధి జరిపారు. ఘటాలకు భక్తులు పూజలు చేశారు. చిన్నారులపై నుంచి ఘటాలను దాటించారు. గిరడ వారింట అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కుప్పిలి, మున్సబు, పూడి వారి ఇళ్లకు ఘటాలను తీసుకెళ్లారు. అనతరం ప్రధానవీధిలోని యాత్ర స్థలానికి తిరువీధిగా ఘటాలను చేర్చారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.వి.సూర్యనారాయణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment