అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు కేంద్రాల వద్దే విక్రయిం
గుమ్మలక్ష్మీపురం: గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను జీసీసీ కొనుగోలు కేంద్రాలు, డీఆర్ డిపోల వద్దే విక్రయించాలని గుమ్మలక్ష్మీపురం జీసీఎంఎస్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ కృష్ణప్రసాదరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన తన కార్యాలయం వద్ద అకౌంటెంట్ గణపతి గొదాం సూపరింటెండెంట్ ఎం.సాంబశివరావుతో కలిసి 2024–2025 సంవత్సరానికి గాను గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సూచించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధరలను కిలోల చొప్పున ప్రకటించారు. పిక్కతో చింతపండు రూ.34, పిక్క తీసిన చింతపండు కిలో రూ.67, కరక్కాయలు రూ.20, నరమామిడి చెక్క రూ.18, నల్లజీడి పిక్కలు రూ.22, ఇండుగ పిక్కలు రూ.50, ఎండు ఉసిరిక పప్పు రూ.90, కాగుపప్పు రూ.25, విప్ప పప్పు రూ.32, కొండతామర జిగురు రూ.114, ముషిడిక పిక్కలు రూ.100, తానికాయలు రూ.18, కుంకుడు కాయలు రూ.35, శీకాకాయలు రూ.40, అడవి తేనె రూ.250, పుట్ట తేనె రూ.160లు, తేనైమెనం రూ.160, కొండ చీపుర్లు(గ్రేడ్–1) రూ.45లు చొప్పున ధర నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఉత్పత్తులు సేకరించే సమయంలో గిరిజనులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, దళారులకు అమ్మి మోసకపోకుండా జీసీసీలోనే విక్రయించి గిరిజన సహకార సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా గిరిజనులకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణప్రసాదరావు, జీసీఎంస్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment