విధులు ముగించి ఇంటికి వస్తుండగా..
గంట్యాడ: విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ ఎన్‌వీ రమణ రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతిచెందారు. గంట్యాడ మండలంలోని కొండ తామరపల్లి జంక్షన్‌లో జరిగిన ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఎన్‌వీ రమణ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో ఏపీఎస్పీ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. బుధవారం ఆయన విధులు ముగించుకుని విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌కు స్కూటీపై వస్తుండగా కొండతామరపల్లి జంక్షన్‌కు వచ్చేసరికి అనంతగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జొన్నడకు చెందిన గురునాథ రెడ్డి అనంతగిరి వెళ్తున్నాడు. తామరపల్లి జంక్షన్ వద్ద ఎదురెదురుగా వారిద్దరి వాహనాలు ఢీకొట్టడంతో స్కూటీపై వస్తున్న హెచ్‌సీ రమణ అక్కడక్కడే మృతిచెందాడు. గురునాథ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లూచేతులు విరిగిపోయాయి. దీంతో కానిస్టేబుల్ గురునాథ రెడ్డిని స్థానికులు 108 అంబులెన్సులో విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి
మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment