రాష్ట్రస్థాయిలో సత్తాచాటిన తలవరం సైన్స్ ప్రాజెక్టు
వీరఘట్టం: విజయవాడలో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో వీరఘట్టం మండలం తలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సత్తాచాటారు. గైడ్ టీచర్ గిరడ రామారావు ఆధ్వర్యంలో విద్యార్థులు దుప్పాడ నితిన్‌కుమార్. పి.గోవింద్‌లు రూపొందించిన ‘నాన్ మోటార్ వాటర్ పంప్’ ప్రాజెక్టు రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆకట్టుకుంది.దీన్ని ఏవిధంగా తయారు చేయవచ్చు? దీని ఉపయోగాలను విద్యార్థులు చక్కగా వివరిస్తూ వారు చేసిన ప్రెజెంటేషన్ అందరినీ మంత్రముగ్ధులను చేయడంతో ఈ ప్రాజెక్టును సదరన్ ఇండియాకు ఎంపిక చేశారు.
అభినందనల వెల్లువ..
మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందడంతో వారికి సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు బి.శ్రీనివాసరావు,రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణారెడ్డిలు అభినందించి ప్రశంసా పత్రాన్ని, అవార్డును అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతినాయుడు, పాలకొండ ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి, పాఠశాల హెచ్‌ఎం జగన్, జిల్లా సైన్స్ టీచర్ జి.లక్ష్మణరావులు విద్యార్థులను అభినందించారు. గైడ్ టీచర్‌తో పాటు మిగిలిన సైన్స్ టీచర్లును కూడా వారంతా అభినందించారు.
సదరన్ ఇండియాకు ఎంపికై న ‘నాన్ మోటార్ వాటర్ పంప్’ ప్రాజెక్టు
అభినందనలు తెలిపిన జిల్లా
విద్యాశాఖాధికారులు
Comments
Please login to add a commentAdd a comment