![పూలకుండీ ఎత్తుకెళ్తున్న వ్యక్తి(సీసీ ఫుటేజీ)
- Sakshi](/styles/webp/s3/article_images/2023/10/19/18pdp34-180059_mr_0.jpg.webp?itok=QjHvPod7)
పూలకుండీ ఎత్తుకెళ్తున్న వ్యక్తి(సీసీ ఫుటేజీ)
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో చిల్లర దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. శ్రీమత్తుశ్రీకు బానిసైన కొందరు.. తమకు ఏది కనిపించిన ఎత్తుకెళ్తున్నారు. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఇలా చిల్లర దొంగతనాలు చేస్తున్నారు. అమర్‌నగర్‌లోని బుక్‌స్టాల్ ఎదుట పూలకుండీని ఆటోలో వచ్చిన యువకుడు క్షణాల్లో మాయం చేశాడు. ఈ దృశ్యం సీసీఫుటేజీల్లో రికార్డు కావడంతో స్థానికులు నోరెళ్లబెట్టారు. కమాన్, చీకురాయిరోడ్డు, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మిషన్‌భగీరథ కుళాయిలకు బిగించిన స్టీల్‌నల్లాలనూ వదిలిపెట్టడంలేదు. ఆయా కాలనీల్లో ఇంటిబయట ఏర్పాటు చేసిన నల్లాలను ఎత్తుకెళ్లడంతో నీరంతా వృథాగాపోతోంది. సుభాష్‌నగర్‌లోని ఓ ఇంటి ఆవరణలో నిలిపిన స్కూటీ, ఆటో టైర్లను ఊడదీసి ఎత్తుకెళ్లారు. ఇవి కాకుండా చాలా ప్రాంతాల్లో రోడ్లపై నిలిపిన ద్విచక్రవాహనాల నుంచి పెట్రోల్‌ను కూడా లాగేస్తున్నారు. ఈవిషయాలపై పోలీసులకూ ఫిర్యాదులు అందుతున్నాయి. రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నా.. చిల్లరదొంగలు వారికంట పడకుండా తమపని కానిచ్చేస్తున్నారు. పోలీసులు నిఘాను మరింత పెంచి చిల్లర దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
● పూలకుండీ, నల్లాలు ఎత్తుకెళ్లిన వైనం
Comments
Please login to add a commentAdd a comment