భూగర్భ జలాల నాణ్యత పరీక్షించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం సంచార భూగర్భ జలాల నాణ్యత ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద భూగర్భజలాల నాణ్యత ప్రయోగశాల (మొబైల్ క్వాలిటీ ల్యాబ్ ఆన్ వీల్స్)ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ముఖ్యంగా రామగుండం పరిసర ప్రాంతాలు, ఎస్సారెస్పీ ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల నాణ్యతపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా భూగర్భ జల అధికారి లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పీఎం శ్రీ పథకం అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంశ్రీ లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పీఎంశ్రీ కి ఎంపికై న పాఠశాలల హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పీఎం స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా రెండో విడతలో 16 పాఠశాలలు ఎంపికై నట్లు వివరించారు. ఆయా పాఠశాలల్లో పనులను ఈనెల ఆఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కార్యచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈవో మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి డైరెక్టర్లకు సన్మానం
గోదావరిఖని(రామగుండం): సింగరేణి నూతన డైరెక్టర్లుగా నియమితులైన డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ పీపీ కొప్పుల వెంకటేశ్వర్లును ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ సోమవారం సన్మానించారు. సీఅండ్‌ఎండీ కార్యాలయంలో ఇద్దరినీ కలిసి శాలువాతో సన్మానించారు.
భూగర్భ జలాల నాణ్యత పరీక్షించాలి
Comments
Please login to add a commentAdd a comment