పనులు త్వరగా పూర్తి చేయండి
రామగుండం: రామగుండం ఐటీఐ సెంటర్ ప్రాంగణంలో జరుగుతున్న ఏటీసీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని లేబర్, ఎంప్లాయిమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్‌కుమార్ సూచించారు. సోమవారం సంజయ్‌కుమార్ జిల్లాకు రాగా, కలెక్టర్ కోయ శ్రీహర్ష పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఏటీసీ భవన పనులను పరిశీలించారు. ఆరు ట్రేడ్‌లతో యువతకు ఉపాధి శిక్షణ అందించేందుకు పనులు పూర్తి చేసి పరికరాలను అమర్చేందుకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ట్రేడ్ కోర్సులకు సంబంధించి పరికరాలు ఐటీఐకి చేరుకున్నాయని, భవనం అందుబాటులోకి వస్తే పరికరాలను ఇన్‌స్టాల్ చేసి యువతకు శిక్షణ తరగతులు ప్రారంభించవచ్చని పేర్కొన్నారు. సెంటర్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, ఐటీఐ ప్రిన్సిపాల్ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి, సంతోషిమాత ఆలయ ప్రాణ ప్రతిష్ఠాపన ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలతో హోమం, వివిధ నదుల జలాలు, 80 కలశాలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్యాల రామారావు, కేశవరావు, సత్యనారాయణరావు, మాధవరావు, రావికంటి ఈశ్వర్, శ్రీపతిరావు, లోకేశ్ అగర్వాల్, శివ సంతోష్, బద్రి విశాల్ తదితరులు పాల్గొన్నారు.
కుష్ఠువ్యాధి నియంత్రణపై అవగాహన
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే త్వరగా అరికట్టవచ్చని జిల్లా పారా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవిసింగ్ అన్నారు. వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలపై సోమవారం మండలంలోని వెన్నంపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొద్దు బారిన తెల్ల మచ్చలు స్పర్శ లేకుండా ఉంటాయని, శరీరం రాగి వర్ణంలోకి మారి, చర్మం పాలిపోయినట్లు ఉంటుందని, మచ్చలపై చెమట రాకుంటే కుష్ఠువ్యాధిగా నిర్ధారణ చేయవచ్చన్నారు. ఈ వ్యాధి చికిత్సకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బావన, హెచ్‌ఈవో లక్ష్మణ్, ఏఎన్‌ఎం శైలజ తదితరులు పాల్గొన్నారు.
టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థి ప్రతిభ
కమాన్‌పూర్(మంథని): జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పోటీల్లో కమాన్‌పూర్ మండలం జూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి వైద్యశ్రీ వరుణ్ ప్రతిభచాటి ప్రథమ బహుమతి సాధించాడు. జిల్లా విద్యాధికారిణి డి.మాధవి చేతులమీదుగా బహుమతి అందుకున్నాడు. జిల్లా సైన్స్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు సురేంద్రప్రసాద్, రాజేశ్వర్‌రావు, సైన్స్ కోర్డినేటర్ శ్రీనివాస్, ఫోరం ఉపాధ్యక్షుడు జక్కం శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం సుజాత, గైడ్ టీచర్ ఎం.శ్రీనివాస్ తదితరులు వరుణ్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment