సుల్తానాబాద్(పెద్దపల్లి): రైతులు ఏయే పంటలు సాగుచేస్తున్నారనే విషయమై వ్యవసాయాధికారులు సర్వే చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయికి వెళ్లకుండానే వివరాలు నమోదు చేస్తుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా శ్రీఏఈవో యాప్‌శ్రీను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాసంగిలో పంట సమగ్ర సర్వే కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో మొత్తం 2,16,5,595 ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా, అధికారులు వివరాలు నమోదు చేశారు.
వరి వైపే మొగ్గు
వ్యవసాయ విస్తరణ అధికారులు జిల్లాలోని 45 క్లస్టర్ల పరిధిలో క్షేత్రస్థాయిలో రైతులు వద్దకు వెళ్లి చేపట్టిన పంటల నమోదు ప్రక్రియ పూర్తయింది. వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రైతులకు సంబంధించి భూముల సర్వే నంబరు, సాగు విస్తీర్ణంతో పాటు వేసిన పంట, విత్తన రకం, ప్రధాన, అంతర పంటలు, నీటి వసతి తదితర వివరాలు సేకరించారు. సాగుచేసే ప్రతీ రైతు వివరాల నమోదు ఆధారంగా ప్రభుత్వ కేంద్రాల్లో పంట విక్రయించుకునే అవకాశం ఉంది. దిగుబడి అంచనా వంటి వివరాలు నమోదు చేస్తేనే కేంద్రాల్లో పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో ఈ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారుల వద్దకు వెళ్లి సరి చేయించుకుంటున్నారు. అలాగే పంటలు సాగు చేస్తున్న వారి ఫోన్‌నంబర్‌లకు సందేశం రూపంలో పంపిస్తున్నారు.
జిల్లాలో సాగవుతున్నపంటలు
పంట ఎకరాల్లో..
వరి 1,98,000
మొక్కజొన్న 16,500
గ్రౌండ్‌నెట్ 45
వెజిటేబుల్ 50
సన్‌ఫ్లవర్ 2,000
మొత్తం 2,16,5,595
పకడ్బందీగా నమోదు ప్రక్రియ
జిల్లాలో సాగవుతున్న పంటల నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాం. పంటలకు సంబంధించి వివరాలు ఏఈవోలు నమోదు చేశారు. రైతులు వారి వివరాలు సరి చేసుకునేందుకు అవకాశం కల్పించాం.
– ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment