![‘భాగ్యనగర్’ రద్దును ఉపసంహరించుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09gdk126-180071_mr-1739130780-0.jpg.webp?itok=MVuZO0_4)
‘భాగ్యనగర్’ రద్దును ఉపసంహరించుకోవాలి
రామగుండం: సిర్‌పూర్ కాగజ్‌నగర్– సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును వివిధ కారణాలు చూపుతూ సోమవారం నుంచి పది రోజుల పాటు రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ‘సాక్షి’లో ‘కృపయా ధ్యాన్‌దే’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి సామాజిక కార్యకర్త మద్దెల దినేశ్ స్పందించారు. రైల్వే మంత్రి, ద.మ.రైల్వే జీఎం, డీఆర్‌ఎంలకు ‘ఎక్స్’ వేదికగా ‘సాక్షి’ కథనాన్ని జోడిస్తూ ఫిర్యాదు చేశారు. భాగ్యనగర్ రాకపోకలు సాగించే రూట్‌లో ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోయినా అకారణంగా రద్దు చేయడంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రైల్వేశాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టే క్రమంలో కేవలం ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తూ గూడ్స్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి రైల్వే మంత్రి, జీఎంతో మాట్లాడి భాగ్యనగర్ రైలును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
నేటి ప్రజావాణి రద్దు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్న ట్టు కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటనలో తెలి పారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు ఈ విషయాన్ని గమనించాలనని పేర్కొన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment