జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా అన్నారు. పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కాకతీయ ఆడిటోరియంలో సూపర్‌మీట్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ పెన్షన్ అంశంపై త్వరలో యాజమాన్యంతో చర్చించనున్నట్లు తెలిపారు. రిటైర్‌మెంట్ కార్డును ఆవిష్కరించారు. అనంతరం సమాజ సేవలో భాగస్వాములైన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆకుల రాంకిషన్, సట్టు ముత్యాలు, డాక్టర్ దుర్గం నర్సయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment