కేటీఆర్‌ను కలిసిన టీబీజీకేఎస్‌ నేతలు | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కలిసిన టీబీజీకేఎస్‌ నేతలు

Published Fri, Apr 19 2024 1:00 AM

శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో  - Sakshi

గోదావరిఖని(రామగుండం): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను గురువారం టీబీజీకేఎస్‌ నాయకులు హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో కలిశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, జాహిద్‌పాషా, నూనె కొమురయ్య, సంపత్‌రెడ్డి, నాగెల్లి సాంబయ్య, చల్ల రవీందర్‌రెడ్డి, వడ్డెపల్లి శంకర్‌ తదితరులున్నారు.

జ్వరాలపై జాగ్రత్తలు తీసుకోవాలి

జూలపల్లి(పెద్దపల్లి): గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ సూచించారు. మండలంలోని చీమలపేటలో డెంగీతో చికిత్స పొందుతున్న ఇద్దరిని గురువారం పరామర్శించారు. క్రమం తప్పకుండా మందులు వాడాలని సూచించి, అనంతరం గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. వైరల్‌ జ్వరాల బారిన పడిన గ్రామస్తుల రక్త నమూనాలను సేకరించాలని సూచించారు. అంతకు ముందు ఎంపీడీవో పద్మజ, ఎంపీవో కిరణ్‌ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సంపత్‌రెడ్డి, హెచ్‌వీ వసంత, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఏఎన్‌ఎంలు అరుణ, రుక్మిణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కేటీఆర్‌తో టీబీజీకేఎస్‌ నాయకులు
1/1

కేటీఆర్‌తో టీబీజీకేఎస్‌ నాయకులు

Advertisement
 
Advertisement
 
Advertisement