నిప్పుల కొలిమి | Sakshi
Sakshi News home page

నిప్పుల కొలిమి

Published Sat, Apr 20 2024 1:15 AM

- - Sakshi

● జిల్లాలో గరిష్టంగా 44.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ● భయపెడుతున్న వడగాడ్పులు

శుక్రవారం నమోదైన ఉష్ణోగత్రలు

(డిగ్రీ సెల్సియస్‌లో)

సాక్షి, పెద్దపల్లి: భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం ఉష్ణోగత్రలు 40డిగ్రీలు దాటాయి. అత్యధికంగా కల్వచర్లలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటల నుంచే భానుడు ఉగ్రరూపం చూపుతుండటంతో జనం ఇళ్లు విడిచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలెవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. అత్యవసర పనులు ఉంటే తప్ప ఇళ్లు విడిచి బయటకు రావటం లేదు. ఎండలు దంచికొడుతుండడంతో పగటిపూట జనసంచారం తగ్గి వ్యాపారాలు డీలా పడుతున్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి 10గంటల వరకు ప్రజలు తమ అవసరాలు తీర్చుకుకంటున్నారు. రాత్రిపూటే పనులు చేసుకుంటున్నారు.

ప్రాంతం ఉష్ణోగ్రతలు

కల్వచర్ల 44.9

కాల్వశ్రీరాంపూర్‌ 44.6

మల్యాల 44.4

మంథని 44.4

కూనారాం 44.3

రామగుండం 44.1

ఆకినపల్లి 44.1

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement