బీఆర్‌ఎస్ ఓటమి
టీబీజీకేఎస్ నాయకుల ఆగడాలతోనే
రామగిరి(మంథని): టీబీజీకేఎస్ నాయకుల ఆగడాలతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ధ్వజమెత్తారు. సెంటనరీకాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న సమయంలో కార్మికుల పక్షాన పోరాడాల్సిన నాయకులు.. వారిని పట్టించుకోలేదని మండిపడ్డారు. గత పదేళ్లలో సింగరేణి కార్మికులకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అయితే, టీబీజీకేఎస్ నాయకుల అవినీతి, అక్రమాలతో బీఆర్‌ఎస్‌కు కార్మికులు దూరమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. సింగరేణి గుర్తింపు కార్మిక ఎన్నికల సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు పోటీకి దూరంగా ఉన్నా రని, కొందరు రాజీనామా చేశారని తెలిపారు. గ తంలో రద్దు చేసిన పదవులపై కేసీఆర్, కేటీఆర్ నిర్ణ యం తీసుకుంటారని వెల్లడించారు. టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులమని చెప్పుకొని తిరుగుతున్న నాయకులకు బీఆర్‌ఎస్ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి అ మ్ముడుపోయే నాయకులు టీబీజీకేఎస్ పేరిట మళ్లీకార్మికుల వద్దకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, నా యకులు జక్కు రాకేశ్, పూదరి సత్యనారాయణగౌ డ్, మ్యాదరబొయిన కుమార్ యాదవ్, దర్ముల రాజసంపత్, దేవ శ్రీనివాస్, గండి శ్రీనివాస్, కన్నూరి శ్రీశైలం, ఆసం తిరుపతి పాల్గొన్నారు.
● జెడ్పీ చైర్మన్ పుట్ట మధు
Comments
Please login to add a commentAdd a comment