సీఎంతో సమావేశంలో ఎమ్మెల్యే ఠాకూర్
గోదావరిఖని: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం జరిగిన కులగణన సమీక్ష సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన –2024 సర్వే పై అందరూ అవగాహన కలిగి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్లు ఎమ్మెల్యే వివరించారు. గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర కులాలకు చెందిన వారి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపడుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వేను త్వరోనే ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేపడతారని పేర్కొన్నారు. తొలుత వివిధ అంశాలపై ప్రజలకు ముందుగానే వివరించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించినట్లు ఠాకూర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment