విద్యుత్ చార్జీల భారం ఆపిన ఘనత కేటీఆర్‌దే
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
గోదావరిఖని: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోపేందుకు యత్నించిన విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన ఘనత బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కే దక్కిందని, ప్రజాభిప్రాయ సేకరణలో ఈఆర్‌సీని ఒప్పించారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక బీఆర్‌ఎస్ కార్యాలయం నుంచి చౌరస్తా వరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అక్కడ మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. టపాసులు పేల్చి సంబురాలు నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ తీరు చారిత్రకమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపే ప్రయత్నాన్ని నిలువరింపజేశారని అన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్‌రావు, కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, బాదె అంజలీదేవి, గాధం విజయ, పెంట రాజేశ్, నాయకులు గోపు అయిలయ్య యాదవ్, అచ్చే వేణు, బొడ్డుపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, చల్లా రవీందర్‌రెడ్డి, జహిద్‌పాషా, పిల్లి రమేశ్, సట్టు శ్రీనివాస్, నూతి తిరుపతి, తోకల రమేశ్, ముద్దసాని సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment