అసహజ మరణాలపై దృష్టి సారించాలి
● రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
గోదావరిఖని: కేసు విచారణ పారదర్శకంగా చేస్తూ, నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, అదృశ్యం, అసహజ మరణాలపై దృష్టి సారించాలని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లోని డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్‌హెచ్‌లతో సీపీ బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. మిస్సింగ్ కేసుల్లో వ్యక్తుల ఫొటోలను అన్ని ఠాణాలకు పంపించి, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మృతికి గల ఆధారాలు సేకరించాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాటసిటీ, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రాపర్టీ కేసుల్లో ప్రివెంట్ యాక్షన్ తీసుకోవాలన్నారు. గంజాయి, పేకాట, పీడీఎస్ రైస్, గుడుంబా, వైట్‌కాలర్ తదితర నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు. పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ ఏసీపీలు రాఘవేంద్రరావు, వెంకటస్వామితోపాటు ప్రతాప్, సుందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment