రైతు శ్రమ నేలపాలు
రామగుండం: అంతర్గాం, రామగుండం మండలాల్లో మంగళ, బుధవారం కురిసిన వర్షాలతో పొట్టదశకు వచ్చిన వరి పైరు నేలవాలింది. మరోపది రోజుల్లో కోతలు ప్రారంభించే క్రమంలో వర్షాలు అన్నదాతను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వ్యవసాయాధికారులు వర్షాలతో పంట నష్టపోయిన రైతులను గుర్తించాలని, నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
కోతలు వాయిదా వేయండి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి ప్రాంతంలో రాను న్న 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి అలివేణి బుధవారం సూచించారు. ఇప్పటికే కోతలు పూర్తయితే ధాన్యం తడవకుండా పొ లం వద్దనే టార్పాలిన్లు కప్పి ఉంచాలన్నారు. లేదంటే ధాన్యంలో తేమ 17శాతాని కన్నా మించే అవకాశం ఉంటుందన్నారు. పచ్చి ధా న్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే నష్టపోయే అవకాశం ఉంటుందని వాతావరణశా ఖ అధికారులు సూచిస్తున్నారని తెలిపారు.
మరో ఇద్దరు బాలికల డిశ్చార్జి
ముత్తారం(మంథని): స్థానిక కేజీబీవీలో దగ్గుతో అస్వస్థతకు గురైన 53 మంది బాలికల్లో 48 మంది ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, పెద్దపల్లి, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాలికలు బుధవారం డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంకో ముగ్గురు బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, గురువారం డిశ్చార్జి చేస్తారని ఎస్‌వో స్వప్న తెలిపారు.
లైకంగికదాడి కేసులో జైలు
పెద్దపల్లిరూరల్: లైంగికదాడి చేసిన కేసులో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కోర్టు జడ్జి నీరజ బుధవారం తీర్పునిచ్చారని ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. 2017లో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారు గొల్లపల్లికి చెందిన హరీశ్‌కుమార్.. ఓ దళిత మహిళపై అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన జడ్జి.. దోషికి 10ఏళ్ల జైలు, రూ.50వేల జరిమానా విధించారని ఎస్సై వివరించారు.
విలేజీ అంతర్గాంలో నేలవాలిన వరిపైరు
Comments
Please login to add a commentAdd a comment