● బిర్యాని, ఫాస్ట్‌ఫుడ్ బూచీతో మోసం
గోదావరిఖని: నగరంలోని రెండు మినీ ఏటీఎం నిర్వాహకులకు సైబర్ నేరగాళ్లు రూ.1.02 లక్షల టోకరా వేశారు. బుధవారం ఓ బిర్యాని సెంటర్‌కు సైబర్ నేరగాళ్లు ఫోన్‌చేసి 50 బిర్యానీలు కావాలని ఆర్డర్ ఇచ్చారు. ముందుగా డబ్బులు కావాలని బిర్యాని సెంటర్ నిర్వాహకులు అడగడంతో మార్కండేయకాలనీలోని ఓ చోటికి వెళ్తే డబ్బులు ఇస్తారని సైబర్ నేరగాళ్లు బదులిచ్చారు. అక్కడకు వెళ్లిన తర్వాత మళ్లీ బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు.. సైబర్‌నేరగాళ్లకు ఫోన్ చేయగా అక్కడ ఉన్న పలానా పేరు అతనికి ఫోన్ ఇవ్వాలని సూచించారు. దీంతో బిర్యానీ సెంటర్ నిర్వాహకుడు అతడికి ఫోన్ ఇచ్చాడు. వాళ్లిద్దరూ మాట్లాడుకున్నారు. బిర్యానీ వ్యాపారి ఎదురుగా ఉండగానే ఫోన్‌లో సంప్రదింపులు జరిపి తనకు అర్జంట్‌గా రూ.50వేలు అవసరం ఉందని, ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆతను క్యాష్ ఇస్తాడని, అందుకు రూ.3వేలు కమీషన్ తీసుకోవాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. కమీషన్‌కు కట్ చేసుకుని మిగతా రూ.47వేలను సైబర్ నేరగాళ్లకు ఆన్‌లైన్‌లో ఫోన్‌పే చేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత రూ.50వేలు ఇవ్వాలని బిర్యాని సెంటర్ వ్యక్తిని కోరాడు. తనకు బిర్యాని డబ్బులు ఇస్తానంటే ఇక్కడకు వచ్చానని, తానెందుకు డబ్బులు ఇవ్వాలని మినీ ఏటీఎం సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మినీ ఏటీఎం ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో ఏటీఎం సెంటర్‌కు ఇదే తరహా టోకరా..
రాజేశ్ థియేటర్ సమీపంలోని మరో ఏటీఎం సెంటర్‌కు సైబర్ నేరగాళ్లు రూ.55వేలు టోకరా వేశా రు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడికి ఫోన్‌చేసి 50 ఎగ్ బిర్యానిలు కావాలని కోరారు. ఆర్డర్‌కు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని సంబంధిత ఫోన్ చేసిన వ్యక్తిని కోరగా.. సమీపంలోని మినీ ఏటీఎంకు వెళ్లా లని సూచించాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఫోన్‌లో మాట్లాడుతూనే సైబర్ నేరగాళ్లు రూ.55వేలు అదే తరహాలో మోసం చేశారు. ఒకేరోజు రూ.1.02 లక్ష లు టోకరా వేయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment