వేగంగా ధాన్యం కొనుగోలు
పెద్దపల్లిరూరల్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వారంలోగా పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో ఆయన ధాన్యం కొనుగోళ్ల తీరుపై సమీక్షించారు. ఇప్పటివరకు 2,11,449 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇంకా 70వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసుందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికపు డు రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. అన్‌లోడ్ చేసే సమయంలో రైతులను ఇబ్బంది పెట్టేలా కోతలు విధిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్డీవో రవీందర్, డీఎస్‌వో ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment