35 మంది కాంట్రాక్టు కార్మికులకు పదోన్నతి
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ కేశో రాం సిమెంట్ కర్మాగారంలోని 35 మంది కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులకు మంగళవారం పర్మినెంట్ కార్మికులుగా పదోన్నతి కల్పించారు. హె చ్‌ఆర్ మేనేజర్ పార్థసారథి, పర్మినెంట్ కార్మికసంఘం అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి వా రికి నియామకపత్రాలను అందజేశారు. యూ నియన్ ప్రధాన కార్యదర్శి దాడి మహేశ్, వ ర్కింగ్ ప్రెసిడెంట్ పర్శవేని శ్రీనివాస్, హెచ్‌ఆర్ అధికారి సదానందం పాల్గొన్నారు. కాగా, దీ పావళి పండుగ సందర్భంగా పర్మినెంట్ కార్మికులకు రూ.90వేల బోనస్ చెల్లించాలని కార్మికసంఘం అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి కోరారు.
3 నుంచి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
మంథని: మంత్రపురిలోని మహాలక్ష్మీ ఆల యంలో ఈనెల 3 – 10వ తేదీ వరకు దుర్గా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎండోమెంట్ ఈవో రాజ్‌కుమార్, ఆలయ అర్చకుడు మారుపాక ప్రశాంత్‌శర్మ తెలిపారు. తొమ్మిదిరోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అలంకరణలు ఉంటాయన్నారు. ఈనెల 9న చక్రిభజన, 10న గోపాలకాల్వలు, రాత్రి దుర్గాజననం కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిరంతర భజన కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం
గోదావరిఖని: మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నట్లు సీపీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మందుబాబుల ఆగడాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామన్నారు. నెలరోజుల పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అలాగే డీజే సౌండ్స్, డ్రోన్‌లపైనా ఆంక్షలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
చీడపీడలపై అవగాహన
మంథని: పంట నమోదు, చీడపీడల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని మంథని వ్యవసాయ సహాయక సంచాలకురాలు అంజని ఆదేశించారు. మంగళవారం ప ట్టణంలోని తన కార్యాలయంలో డివిజన్ స్థా యి సమీక్ష నిర్వహించారు. ఆయిల్‌పాం సాగు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు క్లస్టర్ల వారీగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు అనూష, శ్రీకాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పెరిగిన ఉత్పత్తి
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాకారంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో యూ రియా ఉత్పత్తి పెరిగింది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6,17,600.43 మెట్రిక్ ట న్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. ఈ యూరియాను తెలంగాణతోపాటు ఆరు రా ష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని వెల్లడించింది.
యూరియా తరలింపు ఇలా(మెట్రిక్ టన్నుల్లో)
తెలంగాణ 216036.45
ఆంధ్రప్రదేశ్ 56481.30
కర్ణాటక 133897.77
మహారాష్ట్ర 66436.92
ఛత్తీస్‌గఢ్ 43869.06
తమిళనాడు 46529.91
మధ్యప్రదేశ్ 54349.02
15 వరకు ప్రవేశాల గడువు పొడిగింపు
గోదావరిఖనిటౌన్: కాకతీయ విశ్వవిద్యాల యం దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ కో ర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించారని డైరెక్టర్ వి.రామచంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్, పీజీ లో ప్రవేశాలకు ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. మంచిర్యాల, జైపూర్, ఉట్నూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, భూపాలపల్లి ప్రాంతాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉందని తెలిపారు. వివరాలకు 83413 85000 నంబరులో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment