చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి

Published Mon, Nov 4 2024 1:14 AM | Last Updated on Mon, Nov 4 2024 1:14 AM

చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి

చదువుకోవాలని ఉంది.. సాయం చేయండి

ఫోన్‌ పే, గూగుల్‌ పే న్యాత రాజం 9121349332, బర్ల అనుదీప్‌ 8497950725

మేడిపల్లి(జగిత్యాల): చదువుల తల్లికి విద్య కొనలేని ఆపదొచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా చదువుకోవాలని ఉంది.. సాయం చేయండని ఓ నిరుపేద విద్యార్థిని పోస్ట్‌ చేయడం స్థానికంగా చర్చకు దారి తీసింది. కాచారం గ్రామానికి చెందిన న్యాత అక్షయ తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ.. తనకు ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ వచ్చిందని, బీఎస్సీ నర్సింగ్‌ ఆసిఫాబాద్‌లో సీటు వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఎంట్రెన్స్‌ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని, దాతలు సాయం చేయాలని కోరింది. అక్షయ తల్లి చిన్నతనంలోనే చనిపోయిందని, తండ్రి కంటిచూపు సరిగా లేక ఇంటిపట్టునే ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. అక్షయ ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుందని, దాతలు సాయం చేస్తే తన భవిష్యత్తు బాగుంటుందన్నారు. సాయం చేసేవారు కింది నంబర్లకు పంపించాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement