పత్తి తూకంలో మోసం
ధర్మపురి: పత్తి తూకంలో మోసం చేసి పారిపోతున్న దళారులను గ్రామస్తులు, రైతులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. తుమ్మెనాల గ్రామానికి చెందిన అప్పాల మల్లయ్య పత్తిని ఆదివారం పత్తి దళారులు ఎలక్ట్రానిక్ కాంటాలో తూకం వేశారు. రైతు నుంచి కొనుగోలు చేసిన పత్తి 5క్వింటాళ్ల12కిలోలని చూపించారు. కాని రైతు అంతకుముందే ఇంటి వద్ద తూకం వేసుకోగా.. 6క్వింటాళ్ల77కిలోలు ఉంది. 165 కిలోల పత్తి తక్కువగా వచ్చింది. పసిగట్టిన రైతు దళారిని ప్రశ్నించే లోగా వ్యాన్‌తోపాటు పరారయ్యాడు. గ్రామస్తులు, రైతులు వ్యానును వెంబడించి గ్రామ శివారులో పట్టుకొని డ్రైవర్‌తోపాటు కూలీలను పోలీసులకు అప్పజెప్పారు. పత్తి వ్యానును పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ముందుగానే తూకం వేసుకొని విక్రయించడానికి సిద్ధంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment