చిన్నారి బతుకు పోరాటం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): తోటి పిల్లలతో ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన ఓ చిన్నారి నాలుగేళ్ల వయస్సులోనే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది. తనకు వైద్య చికిత్స కోసం దాతలు ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని చేతులు జోడించి వేడుకుంటోంది. కాల్వశ్రీరాంంపూర్ మండలం మంగపేట గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి అనూష–ప్రశాంత్ కూతురు అనన్యను బ్లడ్ క్యాన్సర్ వేధిస్తోంది. వైద్యం కోసం అనన్య తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. రూ.10లక్షలు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని వైద్యులు పేర్కొన్నారు. డబ్బుల్లేని ఆ నిరుపేద కుటుంబం దాతలు సాయం చేయాలని వేడుకుంటోంది.
ఫోన్ పే నంబర్: 9963663653
బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న వైనం
దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment