జువ్వాడి సూర్యారావుకు కన్నీటి వీడ్కోలు
ధర్మపురి: దివంగత జువ్వాడి రత్నాకర్‌రావు సోదరుడు జువ్వాడి సూర్యారావు మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందగా.. మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన మండలంలోని తిమ్మాపూర్‌కు తీసుకొచ్చారు. అంతిమయాత్రలో ప్రభుత్వ విప్, వందలాది మంది పాల్గొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, కృష్ణారావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు తదితరులు పాల్గొన్నారు. సూర్యారావుకు యనకు భార్య భారతి, నలుగురు కూతుళ్లు ఉన్నారు.
సూర్యారావు కూతురు హైకోర్టు జడ్జి
సూర్యారావు నలుగురు కూతుళ్లలో పెద్ద కూతురు శ్రీదేవి ప్రస్తుతం హైకోర్టు జడ్జి. రెండో కూతురు శ్రీలత, మూడో కూతురు శ్రీకుమారి, నాలుగో కూతురు శిరీష. హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న పెద్ద కూతురు శ్రీదేవి తండ్రికి తలకొరివి పెట్టడం అందరిని కలచివేసింది. తండ్రి మరణంతో కూతుళ్లు శోకసంద్రంలో మునిగారు.
Comments
Please login to add a commentAdd a comment