కొత్త గనులతోనే సింగరేణి మనుగడ
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
గోదావరిఖని: కొత్త గనులు ప్రారంభిస్తేనే సింగ రేణికి మనుగడ ఉంటుందని, దీనికోసం కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. జీడీకే–11గనిపై మంగళవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్, గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజకీయ జోక్యంతో సంస్థ దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజాతీ గల అధికారులకు స్థానం లేకుండా పోతోందని, సంస్థ కోసం నిబద్ధతతో పనిచేసే అధికారుల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డైరెక్టర్(పా)పై రాజకీయ ఒత్తిడిన తాము ఖండిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థలో బడాఖాన పేరిట కార్మికుల వేతనాల నుంచి రూ.300 – రూ500 వరకు రికవరీ చేయాలనే యత్నాన్ని విరమించుకోవాలని, యాజమాన్యమే కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచి వెచ్చించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని, తద్వారా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రాధాన్యతను గుర్తించకుండా యాజమాన్యం అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. యాజమాన్యం రాజకీయ జోక్యాన్ని, అవినీతిని అరికట్టాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు సమావేశంలో నాయకులు కె.సారయ్య, వైవీ రావు, మడ్డి ఎల్లాగౌడ్, కవ్వంపల్లి స్వామి, ఆరెల్లి పోశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment