ఒక్కస్కీం కూడా సక్కగా అమలు కావట్లే
సాక్షి,పెద్దపల్లి: ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొమ్మిది నెలలు గడుస్తున్నా ఒక్క స్కీంను కూడా సక్కగా అమలు చేయడం లేద ని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ష రతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలనే డి మాండ్‌తో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి మంగళవా రం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌కు చేరుకుని అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట జరిగిన కా ర్యక్రమంలో ఈశ్వర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పా ర్టీ సమస్య కాదని, లక్షల మంది రైతుల సమస్యన్నారు. అందరికీ రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో అనేకమంది రైతులు రుణమాఫీ వర్తించక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేసేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేదే లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద ర్ హెచ్చరించారు. పుట్టెడు మందిలో పిడికెడు మంది రైతులకు రుణమాఫీ చేసి గొప్పులు చెప్పుకోవ ద్ద ని జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు ఎద్దేవా చేశారు. అధికారంలోకి రావడానికి 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వాటిని అటకెక్కించిందని మాజీఎమ్మె ల్యే దాసరి మనోహర్‌రెడ్డి విమర్శించారు. నాయకు లు రఘువీర్‌సింగ్, రాజ్‌కుమార్, రాములు, ఉష, లక్ష్మణ్, సంపత్, బాలాజీరావు, శ్రీనివాస్ ఉన్నారు.
మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజం
Comments
Please login to add a commentAdd a comment