శుభ్రత పాటిస్తరు.. మద్యం ముట్టరు
● ఆదర్శం.. నారాయణపూర్, పదిర, హరిదాస్‌నగర్, దుమాలవాసులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల)/ఇల్లంతకుంట(మాన కొండూరు): మద్యం ముట్టరు.. పరిశుభ్రత పాటిస్తున్నరు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, పది ర, హరిదాస్‌నగర్, దుమాల ప్రజలు. ఈ గ్రామాల్లో మద్యం అమ్మితే రూ.5 వేలు జరి మానా విధిస్తామని 20 ఏళ్ల క్రితం తీర్మానం చేశారు. రోడ్లకిరువైపులా పచ్చని చెట్లు ఉన్నాయి. తడి, పొడి చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. వర్మి కంపోస్టు ద్వారా ఆదాయం పొందుతున్నారు. తాను సర్పంచ్‌గా హరిదాస్‌నగర్‌లో స్వచ్ఛతపై దృష్టిసారించానని, గ్రామానికి జాతీయ అవార్డు వచ్చిందని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చీటి లక్ష్మణ్‌రావు తెలిపారు.
జంగారెడ్డిపల్లి: ఇల్లంతకుంట మండలంలోని జంగారెడ్డిపల్లె 2023లో జిల్లాస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు, వరుసగా నాలుగేళ్లు దీన్‌దయాళ్ అవార్డులు అందుకుంది. తడి, పొడి చెత్త వేయడానికి గ్రామ వీధుల్లో స్టీల్ డబ్బాలు ఏర్పాటు చేశారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని ఓ దాత 700 బట్ట సంచులు అందజేశారు. గ్రామస్తులు ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. ప్రతీ వీధిలో సీసీ రోడ్లు కనిపిస్తాయి. సీసీ కెమెరాలు, మైక్ సెట్లు, ఓపెన్ జిమ్‌తో ఆకర్షణగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment