నీడ స్వచ్ఛంద సేవా సమితి
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనికి చెందిన పల్లెర్ల రమేశ్‌గౌడ్ నీడ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేశాడు. దీని పేరిట 2016లో వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. ఇందులో 80 మంది సభ్యులున్నారు. గోదావరిఖని తిరుమల్‌నగర్‌కు చెందిన సతుకు రాజ్యలక్ష్మి, వినోభానగర్‌కు చెందిన రాసూరి రాజేశ్వరికి, తిలక్‌నగర్‌కు చెందిన మేకల గంగకు, రామగుండంలోని రాయదండికి చెందిన బోరి నర్సయ్యకు సొంతిల్లు లేదు. పిల్లలతో వారు పడుతున్న ఇబ్బందులను చూసి, దాతల నుంచి విరాళాలు సేకరించి, ఇళ్లు నిర్మించి ఇచ్చారు. నీడ ఆరోగ్యమస్తు పెన్షన్ అనే పథకాన్ని 2018లో ప్రారంభించారు. డయాలసిస్ పేషెంట్లకు రూ.521 చొప్పున ప్రతీ నెల అందిస్తున్నారు. రమేశ్ మన 100 రూపాలు.. సమాజం కోసం పేరిట మరో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశాడు. ఇందులో సామాన్యులు సైతం చేరుతున్నారు. ప్రతీ నెల రూ.100 జమ చేస్తున్నారు. ఆ డబ్బులతో నిరుపేదలకు ఆర్థికసాయం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment