చెక్కు అందజేత
గోదావరిఖని: అనారోగ్యంతో ఇటీవల మర ణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ భద్ర త ఎక్స్‌గ్రేషియా చెక్కును మంగళవారం అంద జేశారు. గోదావరిఖని వన్‌లౌన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసిన కె.లక్ష్మీనారాయణ భార్య శంకరమ్మకు రూ.8లక్షల విలువైన చెక్కును ఆ యన అందజేశారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, సూపరింటెండెంట్ సంధ్య, జూనియర్ అసిస్టెంట్ నజియా తదితరులు పాల్గొన్నారు.
‘కేశోరాం’ కార్మికుల నిరసన
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ కేశో రాం సిమెంట్ కంపెనీ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. దీపావళి బోనస్ విషయంలో యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఇచ్చిన పిలుపు మే రకు సంఘం ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీని వాస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉ ద యం విధులకు హాజరయ్యారు. నాయకులు పెరుమాండ్ల రమేశ్, వేల్పుల సంపత్‌యాదవ్, బత్తిని సతీశ్, ముల్కనూరి శ్రీధర్, చిలగాని శ్రీనివాస్, సాధిఖ్‌పాషా, ప్రసాద్ పాల్గొన్నారు.
నృత్య ప్రదర్శనలో ప్రతిభ
గోదావరిఖనిటౌన్: కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలో నగరానికి చెందిన కళాకారులు మామిడి వైష్ణవి, ఇంజపురి వామిక అద్భుత ప్ర తిభ కనబర్చారు. శ్రీశైలం ఆలయ కమిటీ చైర్మ న్ శివారెడ్డి నుంచి ప్రశంసపత్రాలు అందుకున్నారు. గురువు గుమ్మడి ఉజ్వల, తల్లిదండ్రు లు, నృత్య కళాకారులు వారిని అభినందించారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు
ధర్మారం(ధర్మపురి): ధాన్యం కొనుగోళ్లలో వే గం పెంచాలని జిల్లా కో ఆపరేటివ్ అధికారి శ్రీ మాల సూచించారు. మేడారం, ధర్మారం, ఎర్రగుంటపల్లి, బంజేరుపల్లి, మల్లాపూర్, పత్తిపాకలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆమె తనిఖీ చేసి రైతులతో మాట్లాడా రు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్యాబ్‌లో వివరాలు వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. నిర్దేశిత ఽతేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూ చించారు. కార్యక్రమంలో మేడారం సహకార సంఘం కార్యదర్శి రాసూరి మల్లారెడ్డి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
గోదావరిఖని: సీఎస్‌ఆర్‌లో భాగంగా నిరుద్యో గ యువతకు ఉపాధి కల్పించేందుకు మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్(డీటీపీ) కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికార ప్రతినిధి కిరణ్‌బాబు మంగళవారం తెలిపారు. కోర్సు నేర్చుకునేందుకు సింగరేణి ఉద్యోగుల పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, ప్రభావిత, పరిసర ప్రాంత నిరుద్యోగ మహిళలు, యువతుల నుంచి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అ ర్హత గల అభ్యర్థులు ఆధార్‌కార్డు, కులం సర్టిఫికెట్, పదో తరగతి పాస్ సర్టిఫికెట్, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఈనెల 25లోగా జీవీటీసీలో అందజేయాలని కోరారు.
క్వింటాల్ పత్తి రూ.6,761
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటాలుకు మంగళవారం గరిష్టంగా రూ.6,761 ధర పలికింది. కనిష్టంగా రూ.5,856, సగటు ధర రూ.6,611గా నిర్ధారించామని ప్రత్యేక శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజు తెలిపారు. మొత్తం 1,043 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment