పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి
రామగిరి(ముత్తారం): పాఠశాల సరిసరాలను ని త్యం పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ముత్తారంలోని కస్తూరిబా గాంధీ బా లికల విద్యాలయాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ పరిసరాలు, వంటగది, స్టోర్ రూం, తరగతి గదులను పరిశీలించారు. గతనెలలో విద్యాలయంలో జరిగిన సంఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తు న్న నేపథ్యంలో కలెక్టర్ కేజీబీవీని తనిఖీ చేశారు. ఆ త్మస్థయిర్యం నింపడానికి విద్యార్థులతో ముచ్చటించారు. మౌలిక వసతులు, విద్యాబోధన, వివిధ స మస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని ప్రత్యేకాధికారి స్వప్నకు సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సౌకర్యాలు బాగున్నాయని కలెక్టర్‌కు పలువురు తెలిపారు. అయితే, సెప్టిక్ ట్యాంక్ వద్ద నీటి నిల్వలు తొలగించేందుకు సైడ్ డ్రెయిన్ నిర్మించా లని కలెక్టర్ ఆదేశించారు. డీపీవో వీర బుచ్చయ్య, డీఎల్‌పీవో సతీశ్, ఎంపీడీవో సురేశ్, డిప్యూటీ తహసీల్దార్ షఫీ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన
ముత్తారం మండలం మచ్చుపేట, మైదంబండ, ముత్తారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలె క్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. గన్నీబ్యాగుల కొ రత లేకుండా చూడాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. ఏడీఏ అంజని, ఏవో అనూష, ఏఈవో శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం ముత్తారం కేజీబీవీ ఆకస్మిక తనిఖీ
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా ఉన్నతాధికారి
Comments
Please login to add a commentAdd a comment